బెంగళూరు: కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య తన వైఖరి మార్చుకున్నారని ఆరోపించారు. ధర్మస్థల దర్యాప్తులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సిద్ధరామయ్య అన్నారు.
కాగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై బుధవారం స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ధర్మస్థలలో తవ్వకాలకు ఆదేశించింది మీరే కదా? అని సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించారు. ‘కేవలం మట్టిని మాత్రమే తవ్వారు. ఎటువంటి ఆధారాలు లేదా మానవ అవశేషాలు లభించలేదు. ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి, తన ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని సీఎం చెబుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని జోషి విమర్శించారు. ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తన పూర్తిగా ఖండించదగినదని అన్నారు.
Also Read:
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?
After Rakhi Man Rapes Cousin | రాఖీ కట్టిన చెల్లి వరుసైన బాలికపై.. అత్యాచారం చేసి చంపిన వ్యక్తి
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?