Ayodhya Ram Temple | మహాకుంభమేళా వేళ అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల (Devotees) సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న విషయం తెలిసిందే. యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అటు నుంచి అటు అయోధ్యకు వెళ్తున్నారు. దీంతో అయోధ్యా నగరి భక్తులతో రద్దీగా మారుతోంది. ప్రతి రోజూ లక్షలాది సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. భక్తులు రామ్ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. గత 20 రోజుల్లోనే 50 లక్షలకుపైగా భక్తులు రామ్ లల్లా ఆస్థానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో రామ్ లల్లా దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. మొన్నటి వరకు ఆలయాన్ని ఉదయం 7 గంటలకు తెరిచేవారు. ఇప్పుడు ఓ గంట ముందు సాధారణ ప్రజల దర్శనం కోసం తెరుస్తున్నారు.
#WATCH | Uttar Pradesh | Devotees continue to arrive in Ayodhya’s Ram Temple in large numbers. pic.twitter.com/0yw0NXj0Zk
— ANI (@ANI) February 11, 2025
Also Read..
Maha Kumbh | కుంభమేళా నుంచి ఏపీకి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు
Keir Starmer | హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని