Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. అధిక సంఖ్యలో భక్తుల రాకతో కుంభమేళా ప్రాంతం కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 43 కోట్ల మందికిపైగా భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
As per the Uttar Pradesh Information Department, more than 43 crore people have taken a holy dip so far. pic.twitter.com/oSCr0SQlpw
— ANI (@ANI) February 11, 2025
300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే అన్ని దారులు ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిపోయాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్రయాగ్‌రాజ్ రావడానికి తమకు 16 గంటలు పట్టిందని ఒక కుటుంబం వాపోయింది. నడక దారులు కూడా కిక్కిరిసిపోవడంతో 4 కి.మీ దూరానికి నాలుగు గంటలు పడుతున్నదని పలువురు భక్తులు వాపోతున్నారు. తాము అనుకున్న సమయానికి చేరలేక, గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేయలేకపోతున్నామంటూ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Huge crowd of devotees continues to arrive at Maha Kumbh Mela Kshetra to take a holy dip in Triveni Sangam. pic.twitter.com/ISI0pQgKgu
— ANI (@ANI) February 11, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
As per the Uttar Pradesh Information Department, more than 43 crore people have taken a holy dip so far. pic.twitter.com/iY31NjCQXV
— ANI (@ANI) February 11, 2025
Also Read..
PM Modi: పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. డిన్నర్ ఇచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Ayodhya Ram Mandir: కుంభమేళా ఎఫెక్ట్.. అయోధ్య రామాలయ దర్శన వేళల్లో మార్పులు
Gutha Sukender Reddy | మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు