న్యూఢిల్లీ: ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. ఎలిసీ ప్యాలెస్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యువల్ మాక్రన్.. వెల్కమ్ డిన్నర్ ఇచ్చారు. పారిస్‌లో జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మాక్రన్, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. మోదీని మాక్రన్ ఆలింగనం చేసుకున్నారు. తన ఎక్స్ అకౌంట్లో మాక్రన్ వెల్కమ్ చెబుతూ ఓ పోస్టు పెట్టారు. ఎలిసీ ప్యాలెస్‌లోకి మోదీ ఎంట్రీ ఇచ్చిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పారిస్ చేరుకున్నారు. మాక్రన్‌తో పాటు జేడీ వాన్స్‌ను కూడా మోదీ కలుసుకున్నారు. నెల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సుస్వాగత విందులో ముగ్గురు కలిసి దిగిన ఫోటోలను ప్రధాన మంత్రి కార్యాలయం షేర్ చేసింది.
పారిస్‌లో భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రజలకు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన ఎక్స్‌లో కొన్ని ఫోటోలను ఆయన పోస్టు చేశారు. తీవ్రమైన చలి వాతావరణాన్ని తట్టుకుని భారతీయ సంతతి ప్రజలు తనను కలిసేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లడం ఇది ఆరోసారి.
Delighted to meet my friend, President Macron in Paris. @EmmanuelMacron pic.twitter.com/ZxyziqUHGn
— Narendra Modi (@narendramodi) February 10, 2025