Keir Starmer | బ్రిటన్ ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) హెచ్ఐవీ పరీక్ష (HIV Test) చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. హెచ్ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ (Terrence Higgins Trust)తో కలిసి ప్రధాన మంత్రి స్టార్మర్ ర్యాపిడ్ హోమ్ టెస్టు చేయించుకున్నట్లు వెల్లడించింది.
It’s my mission to end new HIV transmissions by 2030.
You can get a HIV test delivered to your home. It’s free, quick and easy to do.#HIVTestingWeek pic.twitter.com/mrPkKZig5E
— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025
ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ పరీక్ష ఎంతో ముఖ్యమైనదని..అందులో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపించిందని తెలిపారు. కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను ఒక వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. 2030 నాటికి కొత్త హెచ్ఐవీ కేసులు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్మర్.. ఆ లక్ష్యాన్ని చేరేందుకు ప్రజలు ముందుకొచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
An HIV test from home @10DowningStreet
Sir Keir Starmer has become the first Prime Minister and G7 leader to take a public HIV test, as part of National HIV Testing Week which starts today.
You can order a free, quick and easy HIV test now at https://t.co/B37EhUiS9G pic.twitter.com/FL8zON28IV
— Terrence Higgins Trust (@THTorguk) February 10, 2025
Also Read..
Jets Collide | అమెరికాలో ఆగని విమాన ప్రమాదాలు.. ఆరిజోనాలో ఢీకొన్న రెండు ప్రైవేట్ జెట్స్
UK | అమెరికా బాటలో యూకే.. అక్రమ వలసదారుల కోసం జల్లెడ.. భారతీయ రెస్టారెంట్లే టార్గెట్