Hanuman Jayanti | నేడు హనుమాన్ జయంతి (Hanuman Jayanti). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు. హనుమాన్ నామాలను జపిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు (Devotees) పోటెత్తారు. అక్కడ హనుమాన్ గర్హి ఆలయంలో (Shri Ram Janmbhoomi Temple) స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. హనుమంతుడి దర్శనం అనంతరం భక్తులు బాలరాముడిని కూడా దర్శించుకుంటున్నారు. మరోవైపు అయోధ్యతోపాటు దేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఢిల్లీలోని హనుమాన్ బాబా ఆలయం, మధ్యప్రదేశ్లోని మహాకాలేశ్వర్ ఆలయం, బెంగళూరులోని బ్యాతరాయపురలో గల గాలి ఆంజనేయస్వామి ఆలయాల్లో ఇవాళ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
#WATCH | Uttar Pradesh | Devotees arriving at Shri Ram Janmbhoomi Temple to offer prayers on the occasion of #HanumanJayanti pic.twitter.com/waU4vGKOsj
— ANI (@ANI) April 12, 2025
Also Read..
Fire | అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీల నుంచి దూకిన నివాసితులు.. VIDEO
Gambling Operation: అమెరికాలో గ్యాంబ్లింగ్ ఆపరేషన్.. భారత సంతతి రాజకీయవేత్తపై అభియోగాలు
Dust Storm: ఢిల్లీలో డస్ట్ స్టార్మ్.. 205 విమానాలు ఆలస్యం