గురువారం 09 జూలై 2020
National - Jun 21, 2020 , 21:27:26

ఢిల్లీలో నేడు 3000 కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీలో నేడు 3000 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3000 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 59,746కు చేరుకుంది. కరోనాతో ఈ రోజు 63 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 2,175గా నమోదైంది. 

కొవిడ్‌తో చికిత్స పొందుతూ కోలుకున్నవారు 33,113 మంది ఉన్నారని ఆ రాష్ట్ర సర్కారు పేర్కొన్నది. కాగా, దేశవ్యాప్తంగా ఆదివారం వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 4,10,461 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 13, 254 మంది చనిపోయినట్లు తెలిపింది. logo