Delhi Blast | రాజధాని ఢిల్లీలో పేలుడుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. పేలుడు ఘటనపై ఎన్ఐఏ త్వరలో నివేదిక ఇవ్వనుంది.
మరోవైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది. ఇదిలా ఉండగా.. పేలుడు ఘటనపై యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. కోత్వాలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూఏపీఏలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని హై అలర్ట్‌లో ఉన్నది. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, బస్ టర్మినళ్ల వద్ద బందోబస్తు పెంచారు.
Also Read..
PM Modi | కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు.. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!