PM Modi | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం భూటాన్ (Bhutan) పర్యటనలో ఉన్న ప్రధాని.. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ పేలుడు ఘటన తనను కలచివేసిందన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి ఘటన నన్ను కలచివేసింది. దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము. దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రకుట్ర మూలాలను చేధిస్తాం. దీనికి బాధ్యులైన కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు. అమాయకుల ప్రాణాలు తీసిని వారిని కనిపెట్టి చట్టం ముందు నిలబెడతాం. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
Amit Shah | ఢిల్లీ పేలుడు ఘటన.. అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రతా సమావేశం
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!