Amit Shah | ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు (high-level security review meeting).
ఢిల్లీలోని షా అధికారిక నివాసంలో జరుగుతోన్న ఈ హైలెవెల్ మీటింగ్‌కి హోం సెక్రెటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్, ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీశ్ గోల్చా, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జమ్ము కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభట్ ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మరోవైపు దాడి అనంతరం సోమవారం రాత్రి ఘటనాస్థలిని అమిత్ షా సందర్శించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!
Ammonium Nitrate: ఎర్రకోట వద్ద పేలుడు.. అమోనియం నైట్రేట్ వాడినట్లు డౌట్
Delhi Blast | ఢిల్లీ పేలుడుతో దేశంలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత కట్టుదిట్టం