Delhi Blast | రాజధాని ఢిల్లీలో పేలుడుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఉగ్ర కుట్ర ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన కారు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఉమర్ మహ్మద్ అనే వైద్యుడు (Dr Umar Mohammad) కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అతడికి ఫరీదాబాద్‌లోని టెర్రర్ మాడ్యూల్ (Faridabad Terror Network)తో సంబంధాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్ము కశ్మీర్లో పోలీసు బృందాలు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను చేధించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో జరిగిన అరెస్టుల్లో 2,900 కిలోలకు పైగా బరువున్న బాంబు తయారీ సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో షకీల్, డా.అదీల్ రాథర్‌ను అరెస్టు చేశారు.
వీరి అరెస్ట్‌తో డాక్టర్ ఉమర్ మహ్మద్ భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించి ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడ్డట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉపయోగించినట్లుగా పోలీసులు, నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అమోనియం నైట్రేట్ చాలా శక్తివంతమైన పేలుడు పదార్ధాం. దీన్ని సాధారణంగా పరిశ్రమ పేలుళ్లకు వినియోగిస్తుంటారు. గతంలో ఉగ్రవాదులు పలు మార్లు ఈ రసాయనాన్ని వాడారు. ఐఈడీల్లో దీన్ని వినియోగించినట్లు తెలుస్తున్నది.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడుతో దేశంలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత కట్టుదిట్టం
Delhi Blast | ఢిల్లీలో కొనసాగుతున్న హై అలర్ట్.. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేత
వైట్ కాలర్ ఉగ్రవాదుల ఆటకట్టు