Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) బాంబు పేలుడుతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు దేశంలో హైఅలర్ట్ (High Alert) ప్రకటించింది. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతా దళాలు నిఘాను పెంచాయి.
అంతేకాదు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో (irports On Alert) భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజులపాటూ విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ కొనసాగనుంది. ప్రతి ఒక్క ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ పార్కింగ్పైనా దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్స్ మాత్రమే కాకుండా బస్టాండ్స్, ప్రభుత్వ కార్యాలయాలూ, రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు దేశ సరిహద్దుల్లోనూ హైఅలర్ట్ కొనసాగుతోంది.
Also Read..
Delhi Blast | ఢిల్లీలో కొనసాగుతున్న హై అలర్ట్.. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేత
Delhi Blast | ఢిల్లీలో పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం.. షాకింగ్ విజువల్స్
Delhi Suicide Bomber: ఢిల్లీ సూసైడ్ బాంబర్.. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటో రిలీజ్