Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్జేపీ) దవాఖానకు తరలించారు.
Exact moment when the Delhi blast took place earlier today near Red Fort in India’s National Capital. pic.twitter.com/LVdxd3ets7
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 10, 2025
సాయంత్రం కావడంతో ఢిల్లీ వాసులు పనుల నిమిత్తం రోడ్లపై ఉన్నారు. ఎర్రకోట వద్ద పేలుడు శబ్దంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దం విన్న వందలాది మంది భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అప్పుడే ఆగిన ఐ20 కారులో సాయంత్రం 6.52 గంటలకు ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Another visual pic.twitter.com/GoxTrD2x4O
— SureshMaurya (@suresh_maurya_) November 10, 2025
Also Read..
Delhi Blast: ఢిల్లీలో కారు పేలుడు.. యూఏపీఏ కింద కేసు నమోదు
Delhi Suicide Bomber: ఢిల్లీ సూసైడ్ బాంబర్.. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటో రిలీజ్
శరీరాలు ముక్కలై గాల్లో ఎగిరాయి!