Delhi Blast | దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన మార్కెట్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటనతో లాల్ ఖిలా మెట్రో స్టేషన్ (Lal Qila Metro Station)ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు (Metro Station Closed). భద్రతా కారణాల దృష్ట్యా లాల్ ఖిలా మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. మరోవైపు దాడి ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, ఎన్సీజీ, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలోని సీసీటీవీ దృష్యాలను పరిశీలిస్తున్నారు.
Service Update
Lal Qila Metro Station is closed due to security reasons. All other stations are functional as normal.
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 11, 2025
Also Read..
Delhi Blast | ఢిల్లీలో పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం.. షాకింగ్ విజువల్స్
Delhi Blast: ఢిల్లీలో కారు పేలుడు.. యూఏపీఏ కింద కేసు నమోదు
Delhi Suicide Bomber: ఢిల్లీ సూసైడ్ బాంబర్.. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటో రిలీజ్