Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది (Death Toll Rises). నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది.
చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్జేపీ) దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు పేలుడు ఘటనపై యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. కోత్వాలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూఏపీఏలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని హై అలర్ట్‌లో ఉన్నది. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, బస్ టర్మినళ్ల వద్ద బందోబస్తు పెంచారు.
Also Read..
Amit Shah | ఢిల్లీ పేలుడు ఘటన.. అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రతా సమావేశం
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!
Delhi Blast | ఢిల్లీ పేలుడుతో దేశంలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత కట్టుదిట్టం