Doctor | దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను పోలీసు బృందాలు చేధించిన విషయం తెలిసిందే. పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో జరిగిన భారీ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో లక్నోకు చెందిన ఓ మహిళా వైద్యురాలు సాహీనా షాహిద్ (Dr Shaheena Shahid) కూడా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
సదరు వైద్యురాలికి పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జైషే సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. భారత్‌లో జైషే మహిళా విభాగం (Jaishs Women Wing In India) బాధ్యతలను డాక్టర్ సాహీనా షాహిద్‌కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దర్యాప్తు బృందాలు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహీనా లక్నోలోని లాల్ బాగ్ నివాసి. ఫరీదాబాద్‌లో జైషే ఉగ్రవాద మాడ్యూల్‌ను చేధించిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు నుంచి ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్ము కశ్మీర్లో పోలీసు బృందాలు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను చేధించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో జరిగిన అరెస్టుల్లో 2,900 కిలోలకు పైగా బరువున్న బాంబు తయారీ సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో అరెస్టైన ముజమ్మీల్ గనీతో సాహీనాకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!
Delhi Blast | ఢిల్లీ పేలుడుతో దేశంలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత కట్టుదిట్టం
PM Modi | కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు.. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ