Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు (temperature) పడిపోతున్నాయి. గురువారం ఉదయం అత్యంత శీతలమైన పరిస్థితులు నెలకొన్నాయి (seasons coldest morning). భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఢిల్లీలో గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 10.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సాధారణం కంటే 0.2 డిగ్రీలు తక్కువగా నమోదైంది.
ఈ సీజన్లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులే ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణమని ఐఎండీ తెలిపింది. శుక్రవారం నాటికి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఢిల్లీ వాసులు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు.
చలికి తోడు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్య స్థాయిలు కూడా అధికంగానే ఉన్నాయి. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీ – ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 313గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీ కిందకు వస్తుంది.
Also Read..
Parliament | పార్లమెంట్‌ను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం.. ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా
Maharashtra | సీఎం పీఠంపై స్పష్టత..! షిండేసేనకు 12, అజిత్ వర్గానికి 9 మంత్రి పదవులు..?
Priyanka Gandhi | తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. వయనాడ్ ఎంపీగా ప్రమాణం