Parliament | అదానీ వ్యవహారం (Adani issue) పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (Winter session of Parliament) కుదిపేస్తోంది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంతో రెండు రోజులుగా ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక గురువారం మూడో రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది.
గురువారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్సభ (Lok Sabha) ప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీగా రవీంద్ర వసంతరావు చవాన్ చేత స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభా కార్యక్రమాలను మొదలు పెట్టారు.
#WATCH | Amid sloganeering by Opposition MPs in Lok Sabha, House adjourned till 12 noon
(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/jQNVBxHizj
— ANI (@ANI) November 28, 2024
విపక్ష పార్టీల ఎంపీలు సభలో అదానీ అంశాన్ని లేవనెత్తారు. అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్ సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు ఎగువ సభలోనూ (Rajya Sabha) ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపడటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు.
Winter session of Parliament | Rajya Sabha adjourned till 12 noon after Opposition MPs raise the Adani issue and demand discussion on it in the House
— ANI (@ANI) November 28, 2024
Also Read..
Maharashtra | సీఎం పీఠంపై స్పష్టత..! షిండేసేనకు 12, అజిత్ వర్గానికి 9 మంత్రి పదవులు..?
Priyanka Gandhi | తొలిసారి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. వయనాడ్ ఎంపీగా ప్రమాణం
Akhil Akkineni | అఖిల్ – జైనబ్ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున