Priyanka Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ (Wayanad) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Congress leader Priyanka Gandhi Vadra takes oath as Member of Parliament in Lok Sabha
(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/eaLJzpTY2y
— ANI (@ANI) November 28, 2024
తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు.. ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు.
#WATCH | Delhi: Congress leader Priyanka Gandhi Vadra along with her mother and Rajya Sabha MP Sonia Gandhi arrives in Parliament. Ahead of taking oath as a Member of Parliament, she says, ” I am very happy.” pic.twitter.com/v96F3gsoCx
— ANI (@ANI) November 28, 2024
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Parliament as his sister and party leader Priyanka Gandhi Vadra is set to take oath as MP shortly pic.twitter.com/u9LraatFsq
— ANI (@ANI) November 28, 2024
Also Read..
Akhil Akkineni | అఖిల్ – జైనబ్ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున
Dhanush | ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
Earthquake | నాగాలాండ్‌ను వణికించిన భూకంపం