Earthquake | నాగాలాండ్ (Nagaland)లో భూకంపం (Earthquake) సంభవించింది. కిఫిర్ (Kiphire) నగరంలో గురువారం ఉదయం 7:22 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది.
కిఫిర్ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, భవనాలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Dhanush | ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
Sangareddy | పేలిన రియాక్టర్.. సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం
Walking : వాకింగ్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..? మీకు ఏ వాకింగ్ సెట్ అవుతుంది..?