Akhil Akkineni | అఖిల్ – జైనబ్ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున
Akhil Akkineni | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో ఈనెల 26న ఘనంగా జరిగింది.
Akhil Akkineni | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో ఈనెల 26న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున (Nagarjuna) మంగళవారం తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు వీరి వివాహం (Akhil – Zainab wedding) ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అఖిల్, నాగ చైతన్య పెళ్లిళ్లు ఒకేసారి చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై నాగార్జున తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి వివాహాలకు కొంత సమయం ఉంటుందని స్పష్టం చేశారు. అఖిల్ వివాహం వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
‘అఖిల్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతనికి కాబోయే భార్య జైనబ్ ఒక మంచి, అందమైన అమ్మాయి. వారు ఇద్దరూ తమ జీవితాలను కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకు మేమంతా సంతోషిస్తున్నాం. వీరి వివాహం 2025లో జరుగుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వివరించారు.
ఎవరీ జైనబ్ రవ్జీ..?
సోషల్ మీడియా కథనాలు, టాలీవుడ్ సర్కిల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. 27 ఏళ్ల జైనబ్‌కు చాలా పెద్ద బ్యాగ్రౌండే ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్ రవ్జీ ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. ఆమెకు చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి పేరుంది. మన దేశంలోనే కాకుండా దుబాయ్, లండన్‌లోనూ ప్రదర్శనలిచ్చినట్లు తెలిసింది. అంతేకాదు.. ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో ‘మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్’ సినిమాలో కూడా జైనబ్ రవ్జీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్‌గా మంచి పేరున్నా.. జైనబ్ రవ్జీ చాలా లో-ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు.
ఇక ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ (Zulfi Ravdjee) రియల్ ఎస్టేట్ టైకూన్. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు AP ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అఖిల్‌తో జైనబ్ ఎంగేజ్మెంట్ వేళ.. జుల్ఫీ రవ్జీని నవంబర్ 13, 2019న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు వైరల్‌గా మారింది.
జుల్ఫీ రైవ్జీ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో.. గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జుల్ఫీ రవ్జీకి అంత పేరుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఆయన పేరుగాంచారు. ఇక నాగార్జున, జుల్ఫీ రవ్జీకి కొన్నేళ్లుగా స్నేహ బంధం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ స్నేహానికి తోడు అఖిల్-జైనబ్ మధ్య ప్రేమ ఈ రెండు కుటుంబాలను మరింత దగ్గర చేయబోతోంది.
Also Read..
Dhanush | ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
Keerthy Suresh | ఇక అతనితోనే పయనం.. జీవితాంతం ఇలానే మా స్నేహబంధం: కీర్తి సురేష్
Pradeep Machiraju | దీపికతో ప్రదీప్ మాచిరాజు ప్రేమ ప్రయాణం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

