Keerthy Suresh | ఇక అతనితోనే పయనం.. జీవితాంతం ఇలానే మా స్నేహబంధం: కీర్తి సురేష్
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ పెళ్లి గురించి కొంతకాలంగా సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. తన కాలేజీ ఫ్రెండ్‌తో ఈ భామ ప్రేమలో ఉందని, త్వరలో అతన్ని పెళ్లాడనుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తన రిలేషన్షిప్ స్టేటస్‌పై కీర్తి సురేష్ బుధవారం అధికారిక ప్రకటన చేసింది.
Keerthy Suresh | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ పెళ్లి గురించి కొంతకాలంగా సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. తన కాలేజీ ఫ్రెండ్‌తో ఈ భామ ప్రేమలో ఉందని, త్వరలో అతన్ని పెళ్లాడనుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తన రిలేషన్షిప్ స్టేటస్‌పై కీర్తి సురేష్ బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ప్రియుడు ఆంటోనీతో దీపావళి సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
ఇక అభిమానులు ఆంటోని వ్యక్తిగత వివరాల గురించి సోషల్‌మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాలేజీ రోజుల నుంచే కీర్తి సురేష్-ఆంటోని మంచి స్నేహితులని తెలిసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆంటోని కొంతకాలం విదేశాల్లో ఉద్యోగాలు చేశాడని, ప్రస్తుతం కేరళలో పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇరు కుటుంబాల అనుమతితోనే కీర్తి సురేష్ తన రిలేషన్‌షిప్‌పై ప్రకటన చేసిందని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని తెలుస్తున్నది. ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ అనతికాలంలోనే దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ‘మహానటి’ చిత్రంలో అద్భుతాభినయానికిగాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల్లో నటిస్తున్నది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

