Pradeep Machiraju | ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. డుయో నితిన్-భరత్ దర్శకత్వం వహించారు. దీపికా పిల్లి కథానాయిక. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని బుధవారం అగ్ర హీరో మహేష్‌బాబు లాంచ్ చేశారు. రథన్ స్వరపరచిన ఈ పాటను ఉదిత్ నారాయణ్ ఆలపించారు. శ్రీధర్ ఆవునూరి సాహిత్యాన్ని అందించారు.
‘ప్రేమికుల మదిలోని భావాలను ఆవిష్కరించే అందమైన పాట ఇది. చక్కటి సాహిత్యం కుదిరింది. చాలా విరామం తర్వాత ఉదిత్ నారాయణ్ తెలుగులో పాట పాడటం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఓ వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎమ్ఎన్ బాలరెడ్డి, సంగీతం: రథన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నితిన్-భరత్.