Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్డీఏ పక్షాలకు స్పష్టతనిచ్చినట్టు తెలుస్తున్నది. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇక ముఖ్యమంత్రితోపాటు సగానికిపైగా మంత్రి పదవులను (Maharashtra Cabinet) బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో సీఎంతో సహా అత్యధికంగా 43 మంది మంత్రులను నియమించుకునే వీలుంటుంది. ఇందులో షిండే నేతృత్వంలోని శివసేనకు (Shinde Sena) 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో షిండే వర్గానికి మూడు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, జలవనరులు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
Priyanka Gandhi | తొలిసారి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. వయనాడ్ ఎంపీగా ప్రమాణం
Akhil Akkineni | అఖిల్ – జైనబ్ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున
CM Revanth Reddy | ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్.. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్