Ex-Army Chief’s Unpublished Book | ప్రచురణ కాని మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు
Ex-Army Chief's Unpublished Book | మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. (Ex-Army Chief’s Unpublished Book) రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు. ఆర్మీ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఇంకా లభించలేదు.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం నకలును ప్రదర్శించారు. 2020 నాటి భారత్-చైనా సంఘర్షణకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణలను లోక్‌సభలో ప్రస్తావించారు. స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో ఎనిమిది మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అలాగే లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగాన్ని ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు.
మరోవైపు ఈ పుస్తకం ముద్రణ కాపీ, పీడీఎఫ్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియాలో, వార్తల్లో ప్రచారం జరుగుతున్నది. అదే శీర్షికతో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముద్రించినట్లుగా ఉన్న పుస్తకం పీడీఎఫ్ కాపీ కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి ముద్రణ పుస్తకం కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముద్రణకు ఇంకా అనుమతి లభించని ఈ పుస్తకం ప్రచురణ, అందులోని అంశాల లీక్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు.
Also Read:
Boy Hit By Vande Bharat, Killed | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ.. బాలుడు మృతి
Terror Accused Killed In Jail | ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్.. జైలులో హత్య
Woman Forced Into Prostitution | వ్యభిచారం చేయాలని అత్తింటి కుటుంబం ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

