Boy Hit By Vande Bharat, Killed | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ.. బాలుడు మృతి
Boy Hit By Vande Bharat, Killed | రైల్వే క్రాసింగ్ వద్ద ఒక బాలుడిని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు మరణించాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
లక్నో: రైల్వే క్రాసింగ్ వద్ద ఒక బాలుడిని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు మరణించాడు. (Boy Hit By Vande Bharat, Killed) అయితే అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఇందిరా నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద 16 ఏళ్ల అంకిత్ కుమార్‌ను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అతడు చనిపోయినట్లు తెలిపారు. అయితే నిర్ధారణ కోసం ఈసీజీ పరీక్ష చేశారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
మరోవైపు అంకిత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అతడి మరణం గురించి తెలుసుకుని విధ్వంసం సృష్టించారు. భయాందోళన చెందిన మహిళా డాక్టర్లు టాయిలెట్లో దాక్కున్నారు.
సోమవారం నిగోహి ప్రాంతంలోని రోడ్డుపై అంకిత్ మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు రాస్తారోకో కూడా చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో విరమించారు. అయితే ఆసుపత్రిలో విధ్వంసం, డాక్టర్లపై దాడికి పాల్పడిన అంకిత్ కుటుంబ సభ్యులు, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Terror Accused Killed In Jail | ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్.. జైలులో హత్య
Woman Forced Into Prostitution | వ్యభిచారం చేయాలని అత్తింటి కుటుంబం ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య
Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- hit by
- Killed
- Shahjahanpur
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

