Terror Accused Killed In Jail | ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్.. జైలులో హత్య
Terror Accused Killed In Jail | ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్ జైలులో హత్యకు గురయ్యాడు. ఒక ఖైదీ పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టి చంపాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆ ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
చండీగఢ్: ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్ జైలులో హత్యకు గురయ్యాడు. ఒక ఖైదీ పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టి చంపాడు. (Terror Accused Killed In Jail) జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆ ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని ఫరిదాబాద్ జిల్లా జైలులో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్‌కు చెందిన 20 ఏళ్ల అబ్దుల్ రెహమాన్, అయోధ్యలో ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు భద్రతా సంస్థలు ఆరోపించాయి. 2025 మార్చి 2న గుజరాత్, హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్త ఆపరేషన్‌లో అతడ్ని అరెస్ట్ చేశారు. హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు అయోధ్యపై దాడి కుట్రకు సంబంధించిన వీడియో ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆదివారం రాత్రి ఫరిదాబాద్ జిల్లా జైలులో ఉన్న అబ్దుల్ రెహమాన్‌పై తోటి ఖైదీ దాడి చేశాడు. పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్‌ను హత్య చేసిన జమ్ముకశ్మీర్‌కు చెందిన ఖైదీ అరుణ్ చౌదరిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని ఎందుకు హత్య చేశాడు అన్నది ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జైలులో భద్రతా లోపాలపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read:
Woman Forced Into Prostitution | వ్యభిచారం చేయాలని అత్తింటి కుటుంబం ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య
Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

