Delhi-NCR Storm | దేశ రాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం (heavy rain) సృష్టించింది. వర్షానికి తోడు ఇసుక తుపాను (sandstorm) అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తుకు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో (Delhi-NCR Storm) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
బుధవారం రాత్రి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. ఈ వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమైంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో నిజాముద్దీన్ సమీపంలోని లోధి రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం కూలి బైక్‌పై వెళ్తున్న ఓ వికలాంగుడిపై అది పడింది. దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సదరు వికలాంగుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఘటనలో ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో ఓ చెట్టు కూలిపోవడంతో 22 ఏళ్ల అజార్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇక ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మరణించారు. గ్రేటర్ నోయిడాలో వర్షానికి సంబంధించిన సంఘటలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షం కారణంగా సంభవించిన ఘటనల్లో దాదాపు 11 మంది గాయపడ్డారు. ముఖర్జీ నగర్‌లోని పాత ఓవర్‌బ్రిడ్జి గ్రిల్ కొంత భాగం విరిగిపడింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. కాశ్మీరీ గేట్ ప్రాంతంలో బాల్కనీ కూలిపోవడంతో 55 ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు. మంగోల్‌పురిలో బాల్కనీ కూలిపోవడంతో ఒక మహిళతో సహా నలుగురు గాయపడ్డారు.
Also Read..
Coronavirus | కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. మే నెలలోనే 182 కేసులు నమోదు
National Herald case | సోనియా, రాహుల్‌ది ఆర్థిక నేరమే! రూ.142 కోట్ల అనుచిత లబ్ధి పొందారు
DMK Leader | పదవుల కోసం డీఎంకే లీడర్ నీచత్వం! పార్టీ నాయకుల వద్దకు వెళ్లాలని భార్యపై ఒత్తిడి