Coronavirus | కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. మే నెలలోనే 182 కేసులు నమోదు
Coronavirus | కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది.
Coronavirus | తిరువనంతపురం : కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది. ఒక్క మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు.
మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు నిన్న ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్‌లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు, వారిలో 16మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- covid
- India
- Kerala
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

