Arvind Kejriwal | మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు.. తమ ముందు విచారణకు హాజరుకవాలంటూ ఆదేశం
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది. మార్చి 16న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ) అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలల్లో సుమారు ఎనిమిదిసార్లు ఈడీ అధికారులు ఆప్ సుప్రిమోకు సమన్లు పంపారు. మద్యం కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.
ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
Also Read..
Gulf Of Aden | కార్గో నౌకపై క్షిపణులతో హౌతీల దాడి.. ముగ్గురు మృతి
Covid Cases: ఢిల్లీ, రాజస్థాన్, యూపీల్లో పెరిగిన కోవిడ్ కేసులు
MLC Kavitha | సీఎం రేవంత్ అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు: ఎమ్మెల్సీ కవిత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

