Covid Cases: ఢిల్లీ, రాజస్థాన్, యూపీల్లో పెరిగిన కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి.
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
రాజస్తాన్‌లో గడిచిన 15 రోజుల్లో కొత్తగా 226 కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ కూడా పాజిటివ్‌గా తేలారు. అయితే ప్రస్తుతం టెస్టింగ్ తక్కువగా ఉన్న కారణంగా.. నిజానికి పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో ఒకే రోజు 50 కన్నా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం గత ఏడాది మే తర్వాత ఇదే తొలిసారి. ఈ ఏడాది శీతాకాలంలో కేసులు పెరిగినా అవి స్వల్పంగానే ఉంది. యూపీ, బీహార్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో యూపీలో 164 కేసులు నమోదు అయ్యాయి. బీహార్‌లో 14 నుంచి కేసుల సంఖ్య 103కు చేరుకున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Covid 19
- Covid cases
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

