Delhi CM : ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) శనివారం ఉదయం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోదీ ఆమెకు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్, విద్యార్థులను కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా రేఖాగుప్తా మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన రేఖా గుప్తా మాత్రమే కాదు మీరంతా కూడా సీఎంలు కావాలని విద్యార్థులతో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రేఖా గుప్తాకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. కాగా ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కారు.. సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోంది.
ఫిబ్రవరి 24న నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరిచేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాగ్ నివేదికపై ఫిబ్రవరి 25, 27 తేదీల్లో చర్చ జరగనుంది.
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి
Bhutan PM | ఆయనలో నా అన్నను చూసుకుంటున్నా.. మోదీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక