PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతోంది. దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ ఎలాంటి ప్రతీకార చర్య చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ (Rajesh Kumar Singh) సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి (Defence Secretary) భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నిన్న ప్రధానితో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా సమావేశమైన విషయం తెలిసిందే.
Defence Secretary Rajesh Kumar Singh is meeting Prime Minister Narendra Modi: Sources pic.twitter.com/p9rfyTdah9
— ANI (@ANI) May 5, 2025
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. గత నెల 26న జరిగిన రక్షణ సంబంధిత ఉన్నత స్థాయి సమావేశంలో పాక్‌పై చర్యలు తీసుకొనే విషయంలో సాయుధ బలగాలకు మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు రక్షణ సన్నాహకాల్లో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తన ఉద్యోగులందరికీ సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read..
ప్రధానితో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ
Chenab River | పాక్‌కు చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత.. VIDEOS