న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నారు. గత నెల 26న జరిగిన రక్షణ సంబంధిత ఉన్నత స్థాయి సమావేశంలో పాక్పై చర్యలు తీసుకొనే విషయంలో సాయుధ బలగాలకు మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు రక్షణ సన్నాహకాల్లో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తన ఉద్యోగులందరికీ సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.