శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి శిథిలాలను జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సులో గుర్తించారు. దీంతో ఆర్మీ సిబ్బంది వాటిని బయటకు తీశారు. సురక్షితంగా నిర్వీర్యం చేశారు. (Debris Of Pak Missiles) ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో సుమారు వంద మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. భారత సైనిక బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా మే 10న శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో పాక్ క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది.
మరోవైపు ఆదివారం దాల్ సరస్సులో సాధారణంగా నిర్వహించే చాలా లోతుగా క్లీనింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి శిథిలాలను గుర్తించారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది క్షిపణి శిథిలాలను బయటకు తీశారు. సురక్షిత ప్రాంతానికి తరలించి నిర్వీర్యం చేశారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో ఈ క్షిపణి పేలి ఉంటే పెద్ద నష్టం జరిగి ఉండేదని ఆర్మీ అధికారి తెలిపారు. క్షిపణిలోని ఒక భాగాన్ని పరిశీలన కోసం వైమానిక దళానికి అప్పగించినట్లు వెల్లడించారు.
Also Read:
Watch: బీచ్‌లో చిక్కుకున్న స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?
Rat In IndiGo flight | ఇండిగో విమానంలో ఎలుక.. మూడు గంటలు ఆలస్యంగా టేకాఫ్