లక్నో: ఒక వ్యక్తి తన భార్యపై అనుమానించాడు. పిల్లల ముందే కత్తితో పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యను హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. (Man Kills Wife In Front Of Children) చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల సోనూ శర్మకు ఎనిమిదేళ్ల కిందట 28 ఏళ్ల చంచల్తో పెళ్లైంది. దాద్రి ప్రాంతంలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. పిల్లలైన ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు వారికి ఉన్నారు.
కాగా, సోను రెండు నెలలుగా పని కోసం బయటకు వెళ్లాడు. అతడి భార్య చంచల్ ఒక పిజ్జా షాపులో పని చేస్తున్నది. అయితే అక్కడ పని చేసే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నదని సోను అనుమానించాడు. ఈ నేపథ్యంలో పిజ్జా షాపులో పని మానేయమని భార్యతో అన్నాడు. అయితే కుటుంబానికి అండగా ఉండేందుకు ఆ పని మానబోనని ఆమె చెప్పింది.
మరోవైపు ఆదివారం ఉదయం ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో చంచల్ ముఖాన్ని గుడ్డతో కప్పి కత్తితో పొడిచాడు. ఆమె అరుపులు విన్న పిల్లలు నిద్రలేచారు. తండ్రిని అడ్డుకునేందుకు వారు ప్రయత్నించగా తోసేశాడు.
సోను అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యను హత్య చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. చంచల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన సోనును ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Air India Plane | ఎక్కని ప్రయాణికుడు.. వెనక్కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి