భోపాల్: చనిపోయిన పావురాలు బావిలో కనిపించాయి. (Dead Pigeons In Well) దీంతో కలుషితమైన ఆ బావిలోని నీటిని తాగి 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజోలా గ్రామంలోని బావిలో నాలుగు పావురాల కళేబరాలు కనిపించాయి. దీని వల్ల అందులోని నీరు కలుషితమైంది.
కాగా, ఆ బావిలోని నీటిని రాజోలా గ్రామస్తులకు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని 150 కుటుంబాల్లో 60 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందారు. ఈ విషయం తెలిసి అధికారులు వెంటనే స్పందించారు. ఆ గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 120 మంది రోగులకు మందులు అందజేశారు.
మరోవైపు ఆ బావిలో చనిపోయిన నాలుగు పావురాలను గుర్తించినట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హేమకరణ్ ధ్రువే తెలిపారు. ఆ బావి నుంచి నీటి నమూనాలు సేకరించగా కలుషితమైనట్లు తేలిందని చెప్పారు. వెంటనే ఆ బావిని మూసివేసినట్లు తెలిపారు. బావిలోని నీటిని మారుస్తామని అన్నారు. నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంపు ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైద్య శిబిరాన్ని మరో రెండు రోజులు కొనసాగిస్తామని వెల్లడించారు.
కాగా, ఇదే చింద్వారా జిల్లాలోని పలు గ్రామాల్లో ఇటీవల కోల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల కిడ్నీలు పాడవటంతో 20 మందికిపైగా పిల్లలు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Many people have fallen ill after consuming contaminated water from a well in Chhindwara’s Rajola village, Madhya Pradesh.
Many suffered vomiting and diarrhoea. Water samples from the well were taken and were found to be contaminated. Four pigeons were found dead in the well. pic.twitter.com/Uk7xTjvMNP
— Vani Mehrotra (@vani_mehrotra) October 16, 2025
Also Read:
School Van Falls Off Bridge | వంతెన పైనుంచి పడిన వ్యాన్.. 10 మంది స్కూల్ పిల్లలకు గాయాలు
Employee Flees With Railways’ Rs 70 Lakh | రూ.70 లక్షల రైల్వే డబ్బుతో.. ఉద్యోగి పరార్