Corona Virus | దేశంలో మరోసారి కరోనా వైరస్ (Corona Virus) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7 వేలు దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం (Health Ministry Of India).. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 306 మందికి పాజిటివ్‌గా తేలింది. కేరళలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 170 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్లో 114 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 8,573 మంది మహమ్మారిబారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ముగ్గురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి ఎగబాకింది.
రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసులు ఇలా..
కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,223 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ (1,223), ఢిల్లీ (757), పశ్చిమ బెంగాల్ (747), మహారాష్ట్ర (615), కర్ణాటక (459), ఉత్తరప్రదేశ్ (229), తమిళనాడు (204), రాజస్థాన్ (138), హర్యాణా (125), ఆంధ్రప్రదేశ్ (72), మధ్యప్రదేశ్ (65), ఛత్తీస్‌గఢ్ (48), బీహార్ (47), ఒడిశా (41), సిక్కిం (33), పంజాబ్ (33), తెలంగాణ (11), జార్ఖండ్ (10), పుదుచ్ఛేరి (10), జమ్ము కశ్మీర్లో తొమ్మిది, అస్సాం, గోవా రాష్ట్రాల్లో ఆరు చొప్పున, ఛండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మూడు చొప్పున, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు కేసులు, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో కేసు యాక్టివ్‌గా ఉంది.
Also Read..
Shubhanshu Shukla | రాకెట్లో సాంకేతిక సమస్యతో శుభాన్షు శుక్లా రోదసి యాత్ర వాయిదా
Kerala | నాలుగో క్లాస్‌లో గొడవ.. 50 ఏండ్ల తర్వాత ప్రతీకారం
CJI B R Gavai: అణగారిన ప్రజలకు రాజ్యాంగం శక్తినిచ్చింది : సీజేఐ గవాయ్