CJI B R Gavai: అణగారిన ప్రజలకు రాజ్యాంగం శక్తినిచ్చింది : సీజేఐ గవాయ్
CJI B R Gavai: యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనియన్ కార్యక్రమంలో సీజేఐ బీఆర్ గవాయ్ మాట్లాడారు. భారతీయ రాజ్యాంగాన్ని ఆయన ప్రశంసించారు. అట్టడుగు వర్గాల ప్రజలపై రాజ్యాంగం పాజిటివ్ ప్రభావం చూపిందన్నారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగం.. సిరాతో రాసిన ఓ మౌన ఉద్యమం అని సీజేఐ బీఆర్ గవాయ్(CJI B R Gavai) పేర్కొన్నారు. అది మార్పు శక్తికి సంకేతమని, హక్కుల రక్షణ కల్పిస్తుందన్నారు. చరిత్రాత్మకంగా అణగారిన వర్గ ప్రజలను రాజ్యాంగం బలోపేతం చేస్తోందన్నారు. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనియన్ థీమ్‌పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజలపై రాజ్యాంగం పాజిటివ్ ప్రభావం చూపిందన్నారు. కొన్ని దశాబ్ధాల క్రితం, భారత్‌లో లక్షలాది మందిని అంటరానివారిగా చూసేవాళ్లని, అపవిత్రులని వాళ్లను భావించేవాళ్లు అని, ఎవరితో మాట్లాడవద్దు అనేవాళ్లు అని, కానీ ఇప్పుడు రోజులు మారాయని, ఆ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ రోజు ఓపెన్‌గా మాట్లాడుతున్నారని, న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయిలో ఉండి మాట్లాడుతున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు.
పౌరులకు రాజ్యాంగం ఎన్నో నేర్పిందని, అణగారిన ప్రజలు తమ కోసం తాము మాట్లాడవచ్చు అని, వారికి సమాజంలోని ప్రతి చోట సమాన స్థానం ఉందన్నారు. ఆక్స్ఫర్డ్ యూనియన్ వేదికగా ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, దేశంలోని అణగారిని ప్రజల తరపున మాట్లాడుతున్నానని, రాజ్యాంగం కేవలం చట్టపరమైన చార్టరో లేక రాజకీయ ఫ్రేమ్‌వర్క్ కాదన్నారు. అదో ఫీలింగ్ అని, ఓ లైఫ్లైన అని, సిరాతో రాసిన ఓ మౌన ఉద్యమం అని సీజేఐ పేర్కొన్నారు. ఓ సాధారణ మున్సిపల్ స్కూల్ నుంచి .. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగినట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం కేవలం లీగల్ ఫ్రేమ్‌వర్క్ కాదు అని, అదో సామాజిక, నైతిక డాక్యుమెంట్ అని, తీవ్రమైన అసమానతల మధ్య దాన్ని రూపొందించినట్లు చెప్పారు.
Also Read..
రాకెట్లో సాంకేతిక సమస్యతో శుభాన్షు శుక్లా రోదసి యాత్ర వాయిదా
ఉగ్రవాది కంటే హీనంగా! అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల కర్కశత్వం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

