Shubhanshu Shukla | న్యూఢిల్లీ : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపట్టాల్సి ఉంది. కానీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రాకెట్లో సాంకేతిక సమస్యతో శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరగాల్సిన యాక్సియం -5 మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 10వ తేదీన జరగాల్సిన ప్రయోగం వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ (1984లో) తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండవ భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. 41 ఏండ్ల తర్వాత రోదసిలో అడుగుపెడుతున్న భారతీయుడిగా ఆయన పేరు రికార్డులకు ఎక్కనున్నది. లక్నోకు చెందిన శుభాన్షు శుక్లా, 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్నారు. గగన్‌యాన్ మిషన్ కోసం ఏర్పాటుచేసిన ‘భారత వ్యోమగామి దళం’కు 2019లో ఎంపికయ్యారు.
Postponement of Axiom 04 mission slated for launch on 11th June 2025 for sending first Indian Gaganyatri to ISS.
As part of launch vehicle preparation to validate the performance of booster stage of Falcon 9 launch vehicle, seven second of hot test was carried out on the launch…
— ISRO (@isro) June 11, 2025