హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ, జర్మనీలోని రూట్లింగెన్ యూనివర్సిటీల మధ్య గురువారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. మొత్తం ఐదున్నరేండ్ల అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్(ఐఐబీఎంపీ)పై ఈ రెండు యూనివర్సిటీ అధికారులు అన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత విద్యార్థుల విద్యా పురోగతి, జర్మన్ భాషా నైపుణ్యాలను పలువురు ప్రొఫెసర్లు అభినందించారు.
సాఫ్ట్వేర్ రంగంలో అంతర్జాతీయ స్థాయి ఉపాధియే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించామని, విద్యాపరమైన క్రమశిక్షణతో ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మార్చిలో జర్మన్ ప్రతినిధులు హైదరాబాద్‌ను సందర్శించనున్నట్టు తెలిపారు.