మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 25 : ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గురువారం అరైవ్-అలైవ్ రెండో విడుత కార్యక్రమంలో భాగంగా డీసీపీ భాసర్, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, ప్రతి వాహనదారుడు సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒకరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,సీఐ ప్రమోద్ రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.