Cotton candy | పీచు మిఠాయిపై మరో రాష్ట్రంలోనూ నిషేధం.. ఎందుకంటే
Cotton candy | పీచు మిఠాయి విక్రయాలపై హిమాచల్ ప్రదేశ్ నిషేధం విధించింది. ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
Cotton candy | పీచు మిఠాయి (Cotton Candy).. ఈ పేరు వినగానే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పీచు పిఠాయిని తినేందుకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఆసక్తి చూపుతారు. అలాంటి పీచు మిఠాయిపై ఇటీవలే పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలడంతో వాటి విక్రయాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే బ్యాన్ విధించాయి. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్కూడా ఈ పీచుమిఠాయిని నిషేధించింది.
దీని తయారీ, నిల్వ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ( Health and Family Welfare). ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 2025 మే 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్కు ఈడీ సమన్లు మద్యం కేసులో కాదు : మంత్రి అతిశీ
Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

