Kate Middleton | కేట్ అదృశ్యం.. డిసెంబర్ నుంచి ప్రిన్సెస్‌ను చూడలేదు, మాట్లాడలేదంటున్న సీనియర్ సిబ్బంది..!
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో ఆమె గురించి గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో ఆమె గురించి గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అనారోగ్యం వల్ల కేట్ పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం వెల్లడించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ వస్తున్నారు. దీంతో కేట్ ఆరోగ్యంపై పలు వదంతులు మొదలయ్యాయి. శస్త్రచికిత్స అనంతరం కేట్ కోమాలోకి వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ఊహాగానాల మధ్య రాజ కుటుంబం సీనియర్ సిబ్బంది చెబుతున్న మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ ప్రిన్సెస్ కేట్‌ను ఆమె వద్ద పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది చూడలేదని, మాట్లాడలేదని యూకే మీడియా తెలిపింది. ప్రిన్సెస్ ఆరోగ్యం గురించి కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటించే వరకూ తమకు తెలియదని సిబ్బంది చెప్పినట్లు పేర్కొంది. శస్త్ర చికిత్స గురించి, ఆ తర్వాత కోలుకునే ప్రక్రియ గురించి ఎలాంటి విషయాలు తమకు తెలియవని కేట్ సీనియర్ సిబ్బంది చెప్పినట్లు యూకే మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంత మంది సిబ్బందికి మాత్రమే అక్కడ ఏం జరుగుతోందన్న విషయాలపై అవగాహ ఉందని, అయితే వారు మాత్రం పెదవి విప్పట్లేదని సదరు కథనాలు పేర్కొన్నాయి. దీంతో కేట్ అంశం ప్రస్తుతం తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నట్లు యూకే మీడియా వెల్లడించింది.
Also Read..
Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు మద్యం కేసులో కాదు : మంత్రి అతిశీ
Indian Citizenship | గుజరాత్లో 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

