Election Manifesto | సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయ్పత్ర-2024తో పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
ముఖ్యంగా నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ , చిదంబరం, కేసీ వేణుగోపాల్ సహా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.
Also Read..
Shashi Tharoor: శశిథరూర్ ఆస్తి 55 కోట్లు.. డిక్లేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
KCR | రంగదాంపల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఘనస్వాగతం
KTR | ఎండ వేడిమికి రిఫ్రెష్.. పాఠశాల పిల్లలతో కలిసి ఫ్రూట్ జ్యూస్ తాగిన కేటీఆర్