తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు. 2022-2023 సంవత్సరానికి 4.32 కోట్లు ఆర్జించినట్లు ఆ ఎంపీ తెలిపారు. నామినేషన్ పేపర్స్‌లో ఆస్తుల వివరాలు ప్రకటిస్తూ.. తనకు 49 కోట్ల స్థిరాస్థి ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 19 బ్యాంకు అకౌంట్లతో పాటు వేర్వేరు బాండ్ల రూపంలో అమౌంట్ ఉన్నట్లు తెలుస్తోంది. తన వద్ద 534 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ 32 లక్షల ఉంటుందన్నారు. 36వేల క్యాష్ ఉందన్నారు. మారుతి సియాజ్, మారుతి ఎక్స్ఎల్6 కార్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 9 కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నాలుగు కోర్టు కేసులు ఉన్నాయి. దీంట్లో రెండు పరువునష్టం కేసులు ఉన్నాయి. 2019లో ఆయన ఆస్తుల విలువ 23 కోట్లు.