పాట్నా: ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ టాయిలెట్లో నిప్పంటించుకున్నది. (Girl Sets Ablaze In School Toilet) తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను స్కూల్ టీచర్లు, సిబ్బంది గమనించారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం చిట్కోహ్రా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ నుంచి పొగలు రావడాన్ని కొందరు గమనించారు. స్కూల్ టీచర్లు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఐదో తరగతి బాలిక కాలిన గాయాలతో పడి ఉండటం చూశారు. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆమెను తరలించారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రభుత్వ స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ టీచర్లు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది గదిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఆ బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా ఆమెకు నిప్పంటించారా? మండే వస్తువు స్కూల్లోకి ఎవరు, ఎలా తెచ్చారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. స్కూల్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వాంగ్మూలం ఇవ్వలేని పరిస్థితిలో బాలిక ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Boy Hits Man With Car, Drags Body | కారుతో వ్యక్తిని ఢీకొట్టి.. కొంతదూరం ఈడ్చుకెళ్లిన బాలుడు
Watch: క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?