Chhattisgarh tense : ఛత్తీస్‌గఢ్‌లో మతపరమైన జెండాల తొలగింపు, కర్ఫ్యూ విధింపు
Chhattisgarh tense : ఛత్తీస్‌గఢ్ కవర్ధలో మతపరమైన జెండాల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వాగ్వాదం కాస్తా ఉద్రిక్తతకు...

రాయ్‌పూర్ : (Chhattisgarh tense) ఛత్తీస్‌గఢ్ కవర్ధలో మతపరమైన జెండాల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వాగ్వాదం కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. మంగళవారం నాటి రాళ్లు రువ్వుకున్న ఘటన కాస్తా కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవర్ద ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 58 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.
గత వారం ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ.. మంగళవారం ర్యాలీ తీయడంతో మరోసారి హింసను ప్రేరేపించింది. ఈ సంఘటన నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల కింద కవర్ధ ప్రాంతంలో కర్ఫ్యూ విధించింది. రానున్న రోజుల్లో పండగలను దృష్టిలో ఉంచుకుని లోహర చౌక్ ప్రాంతంలో వెలిసిన మతపరమైన జెండాలను తొలగించేందుకు మూడు రోజుల క్రితం ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయని, అయితే రెండు వర్గాలకు చెందిన కొందరు యువకులు ఇక్కడికి చేరి హింసకు పాల్పడ్డారని పోలీసు అధికారి తెలిపారు.
నిషిద్ధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఒక వర్గం వారు మంగళవారం ర్యాలీ చేపట్టడంతో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి సద్దుమణిగిందని వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జెరూసలెంలో 2,700 ఏండ్ల క్రితం టాయిలెట్ లభ్యం
ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ ఆకస్మిక బదిలీ
చర్యలు లేకుంటే ఉద్యమం తప్పదు : రాకేశ్ తికాయత్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
హర్మన్‌ప్రీత్‌సింగ్, గుర్జీత్కౌర్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

