Odisha Train Accident | బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ అదృశ్యం.. ఇంటిని సీజ్ చేసిన సీబీఐ అధికారులు
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు. రైలు ప్రమాదంపై సీబీఐ (CBI) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణలో భాగంగా సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ను ఇటీవలె గుర్తు తెలియని ప్రాంతంలో ప్రశ్నించారు.
అయితే, విచారణలో భాగంగా సీబీఐ అధికారులు మరోసారి బాలాసోర్ వెళ్లారు. జూనియర్ ఇంజినీర్ ను ప్రశ్నించేందుకు వెళ్లగా.. ఆ అధికారి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. దీంతో అతడు ఉంటున్న ఇంటిని అధికారులు సీజ్ చేశారు.
రైలు కార్యకలాపాల విషయంలో సిగ్నల్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్లు, పాయింట్ మెషీన్లు, ఇంటర్లాకింగ్ సిస్టమ్లతో సహా సిగ్నలింగ్ పరికరాల రిపేరింగ్, నిర్వహణ వంటివి వారి పర్యవేక్షణలోనే ఉంటాయి. దీంతో దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు జూనియర్ ఇంజనీర్ ను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను కుటుంబంతో సహా అదృశ్యమవడం పలు అనుమానాలు తావిస్తోంది.
ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో జూన్ 2వ తేదీన ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు సుమారు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read..
Hardik Pandya | వదినకు రూ.లక్ష కాదు.. రూ. 5 లక్షలు ఇస్తా.. పాండ్యా పెళ్లి వీడియో వైరల్
Kedarnath Temple | కేదార్ నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

