Hardik Pandya | టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic ) ను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఉదయ్ పూర్ లో వైభవంగా వీరి వివాహం జరిగింది. కాగా, వివాహానికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివాహ వేడుకలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని కుటుంబ సభ్యులు ఆటపట్టించడం సాధారణమే. అదే పెళ్లి వేడుకకు హైలెట్ గా నిలుస్తుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సరదాగా వధూవరులను ఆటపట్టిస్తూ సందడి చేస్తుంటారు. హార్దిక్ పెళ్లి రోజున కూడా అతడి వదిన, కృనాల్ పాండ్య భార్య ఫాంకురి శర్మ (Pankhuri).. పెళ్లి కొడుకి షూ ని దాచి పెట్టింది. రూ.లక్ష ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తామంటూ ఆటపట్టించింది. ఇందుకు హార్దిక్ రూ.లక్ష కాదు రూ.ఐదు లక్షలు ఇస్తానని వదినతో అన్నాడు. వెంటనే ఆ డబ్బును పంపించాలని పక్కనున్న బంధువులకు చెప్పాడు.
అయినా సరే వదినమ్మ ఫాంకురి శర్మ.. హార్దిక్‌ను ఆటపట్టిస్తూనే ఉంది. డబ్బు మొత్తం పంపిస్తేనే షూస్ ఇస్తానని చెప్పింది. అలా సరదాగా సాగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా, సెర్బియా నటి అయిన నటాషాను హార్దిక్ కరోనా లాక్ డౌన్ సమయంలో 2020 మే 31న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. 2020 జులై నెలలో నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్లో వాళ్ల పెళ్లి సాదాసీదాగా జరగడంతో.. ఈసారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సాంప్రదాయ బద్ధంగా వివాహ బంధంతో మరోసారి ఒక్కటయ్యారు.
Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq
— CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023
Also Read..
Kedarnath Temple | కేదార్ నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి